హైదరాబాద్‌లో ప్రాణాలు తీసిన రీల్స్ వ్యామోహం

  • రీల్స్ చేస్తూ కిందపడిన 14 ఏళ్ల బాలుడు
  • రెయిలింగ్‌పై ఫీట్స్ చేస్తుండగా కిందపడిన బాలుడు
  • నాచారం, మల్లాపూర్ గాంధీ బొమ్మ సమీపంలో విషాదం
సోషల్ మీడియా రీల్స్ వ్యామోహం ఒక బాలుడి ప్రాణాలు తీసింది. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాలలో రీల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకోవాలని భావించిన 14 ఏళ్ల బాలుడు మిథున్ ప్రమాదకర స్టంట్స్‌కు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయాడు.

హైదరాబాద్, నాచారంలోని మల్లాపూర్ గాంధీ బొమ్మ సమీపంలోని బస్తీలో ఉంటున్న మిథున్ తన ఇంటి వద్ద బాల్కనీ రెయిలింగ్‌పై ఫీట్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతనిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మిథున్ మృతి చెందడంతో అతని కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది.

Reel interest
Hyderabad crime News

More Telugu News